“ఇంటింటికి బిజెపి”

“ఇంటింటికి బిజెపి”

రామకృష్ణాపూర్,ముద్ర : మహాజన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఏరియాలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటి ఇంటికి తెలియజేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సత్యనారాయణ,సాయి,ప్రసాద్, శ్యామ్,లక్ష్మణ్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.