మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్ట్

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్ట్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన బీజేపీ నేతలను పోలీస్ లు ముందస్తు గా అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ని ముఖ్య నేతలను తెల్లవారు జాము నుంచి ఇండ్లలో నుంచి పోలీస్ లు అరెస్టుల పర్వం కొనసాగించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ , గూడెం ఎత్తిపోతల పథకం వల్ల నష్టపోయిన రైతులు, బాధితులకు పరిహారం ఇస్తామని ప్రకటన చేస్తేనే హరీష్ రావు పర్యటన కొనసాగించాలని లేని పక్షంలో అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ప్రకటించారు. ధీంతో పోలీస్ లు ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ నేతలను అరెస్టు చేశారు. మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, నాయకులు తులా ఆంజనేయులు, ముదం మల్లేష్, చెన్నూర్ లో నగునూరి వెంకటేశ్వర్లు ఇతర నేతలు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.