బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు..చర్చనీయంశం..

బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు..చర్చనీయంశం..
  • ఊరూరా ప్లెక్సీలు.. బారి కౌటట్లు.. అన్నధానాలు..
  • కేటీఆర్ ఇలాకాలో.. బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ జన ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రాంమోహన్ పుట్టిన రోజు వేడుకలు.. అంగరంగ వైభవంగా తన అభిమానుల మధ్య నిర్వహించుకోవడమే కాకుండా.. బారి హోర్టింగ్లు, కౌటట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడంతో సిరిసిల్ల చర్చనీయంశంగా మారింది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పదవి కోసం పోటీ పడుతున్న బీఆర్ఎస్ నాయకడు బొల్లి రాంమోహన్ సెస్ చైర్మన్ పదవి కోసం ఆశపడి భంగపడ్డాడు. ఏదైన నామీనేట్ పోస్టు రాకపోతుందా అనే భవనతో ఉన్నాడు. ఎన్నాడు లేని విధంగా రాంమోహన్ సిరిసిల్ల బారి ఎత్తున తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాడు.

తన అభిమాన సంఘం పేరుతో సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు తంగళ్లపల్లి మండలంలో చాలా గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఊరూరా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న బారి హోర్డింగ్లు మొత్తం బొల్లి రాంమోహన్ జన్మదిన వేడుకల శుభాకాంక్షలతో నిండిపోయింది. రాంమోహన్ జన్మదినంకు ఎన్నడు లేని విధంగా మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఈ సారి బారిగా ఖర్చు చేసి.. వేడుకలు నిర్వహించడంతో రాజకీయంగా చర్చ జరుగుతుంది.