ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీతను సన్మానించిన బిఆర్ఎస్ నేతలు

ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీతను సన్మానించిన బిఆర్ఎస్ నేతలు

ముద్ర రామన్నపేట జులై 27: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  హైదరాబాద్ ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రానికి చెందిన  సూర్య ప్రభంజనం ఎడిటర్  ఏటెల్లి శ్రీనివాస్ కు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రధానం చేసిన సందర్భంగా గురువారం స్థానిక మండల  బిఆర్ఎస్ నాయకులు  స్థానిక మండల కేంద్రంలో పూలమాలలు శాలువాలతో  ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ జర్నలిస్టు గానే కాకుండా కరోనాకాలంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందజేయడం అభినందనీయమని అన్నారు.  ఒక ఎలక్ట్రిషన్ వర్కర్ గా ప్రారంభమైన ప్రస్థానం నేడు జర్నలిస్టుగా రాణిస్తూ  ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును పొందడం చాలా సంతోషదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి అవార్డులు రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో పొంది మండలానికి గుర్తింపు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ జిల్లా మాజీ డైరెక్టర్ జేల్లా వెంకటేష్,ఎంపీటీసీ ఎం. డి.రెహన్, వార్డు సభ్యులు గొలుసుల ప్రసాద్, నాయకులు ఎం. డి. అక్రమ్,లెంకల ప్రవీణ్,కోట సుధాకర్,మోటే రమేష్,కొమ్ము శేఖర్,వైద్యం సాయి,బుల్లెట్, రాపోలు ఉపేందర్, తెల్ల శేఖర్ ,బొంత మల్లేష్,బాసిత్,అరిఫ్,వంగాల రాజు,కేషవాదాసు ఉదయ్,రాయల్, జవాజి శ్రీకాంత్ ,కందుల మని, సాయిశ్వర్ , కట్కూరి మురళి  పాల్గొన్నారు