తుంగతుర్తి లో హాట్రిక్ దిశగా బి ఆర్ ఎస్

తుంగతుర్తి లో హాట్రిక్ దిశగా బి ఆర్ ఎస్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం లో ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తన నాయకులకు ,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గత రెండు పర్యాయాలు అంత బలంగా లేని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఈసారి పటిష్టపరిచారు .విపక్ష పార్టీలలో బలమైన నాయకులను తన వైపు తిప్పుకున్నారు. అన్ని గ్రామాలలో అనేక మంది విపక్ష పార్టీల కార్యకర్తలను గులాబీ దండులో చేర్చుకున్నారు. ప్రతి గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన స్వయంగా హాజరై కార్యకర్తలకు, ప్రజలకు చేరువవుతున్నారు. నియోజకవర్గం లో మెజార్టీ సర్పంచ్లు,ఎంపీటీసీలు , జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు , బిఆర్ఎస్ పార్టీ వారే కావడం వీరికి తోడు విపక్షాలలో గెలిచిన వారందరూ అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే దగ్గరకు చేరారు. దీంతో ఒక దశలో విపక్షాలు బలహీన  పడ్డాయనేంత వరకు చేరికలు సాగాయి.

కనీసం విపక్ష పార్టీల నుండి వెళ్లే వారిని ఆపే ప్రయత్నం చేసేవారు లేరనే మాట వినవస్తోంది. గతంలో నియోజకవర్గంలో కొంతమేర బలం కలిగిన బిఆర్ఎస్ విపక్షాల నుండి చేరికల తో మరింత బలపడిందని టిఆర్ఎస్ నాయకత్వం చెప్తోంది. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరోపక్క నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి, గ్రామాల అభివృద్ధికి పాల్పడుతున్న ఎమ్మెల్యే కృషితో బిఆర్ఎస్ మునుపటికన్నా బలంగా తయారైంది. విపక్ష అభ్యర్థి ఎవరైనా ముచ్చటగా మూడోసారి విజయం తమదేనని టిఆర్ఎస్ అధినాయకత్వం అంటోంది. సొంత పార్టీలో ఎలాంటి పోటీ లేకుండా ముందస్తుగానే జాగ్రత్త పడ్డ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కెసిఆర్ కు దగ్గర కావడం, పార్టీ పరంగా మంచి పేరు ఉండడంతో, ఎమ్మెల్యే మూడవసారి బరిలోకి దిగడానికి ఏ ఆటంకాలు లేవు. అందుకే ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశాలు భారీగా నిర్వహిస్తున్నారు. సమావేశాలకు భారీగానే జనాలు రావడం, దీంతో టిఆర్ఎస్ మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి గులాబీ జెండా తుంగతుర్తి లో ఎగరవేస్తారనేది  బిఆర్ఎస్ కార్యకర్తల ధీమా.