దొరల పాలనకు చెరమ గీతం పాడాలి

దొరల పాలనకు చెరమ గీతం పాడాలి
  • బహుజన జెండాను ఎగురవేస్తాం
  • గడీల పాలనను అంతమొందిస్తాం
  • బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : దొరల పాలనకు చెమర గీతం పాడాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ రెండు నియోజకవర్గాలలో బలమైన బీసీ సామాజిక వర్గానికి బి ఎస్ పి పార్టీ నుండి సీట్లు కేటాయించడం జరుగుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం ముద్ర తో మాట్లాడుతూ తెలంగాణలో గడీల పాలనను అంతమొందించి 60 శాతం బీసీలు ఉన్న సామాజిక వర్గాన్ని గెలుపొందించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన బిసి గణాంకాలు ఇప్పటివరకు జరుగలేదని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన బీసీ గణాంకాలు ఇప్పటివరకు జరగకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీని మూలాన బీసీలు రాజకీయంగా,ఆర్థికంగా, ఉద్యోగ పరంగా ఆ వాటాను కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టసభల్లో 60 నుంచి 70% కు బీసీలు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చూడాలన్నారు. ఇది నెరవేరాలంటే పాలక వర్గాలైన బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయా వర్గాలకు బీసీలకు టికెట్ కేటాయించినప్పుడు మాత్రమే సాధ్యమైతదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించిన వారిలో బీసీల నుండి 23 మందికి చోటు కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ రెండు నియోజకవర్గాల నుండి బీసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బీసీ సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం ఒకటిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో బహుజన జెండాను ఎగురవేయాలని కోరారు.