మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్‌

మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్‌

బీజేపీ  పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని.. తెలంగాణ మాత్రం ఏకంగా సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పరుష పదాలతో ట్వీట్‌ చేసినందుకు భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని కేటీఆర్‌ తన ట్విటర్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? అంటూ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. భావన ప్రకటనా స్వేచ్ఛ.. దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.