తాండూరు ప్లై ఓవర్ వంతెనపై కారు దగ్దం.. త్రుటిలో తప్పించుకున్న వైద్యుని కుటుంబం

తాండూరు ప్లై ఓవర్ వంతెనపై కారు దగ్దం.. త్రుటిలో తప్పించుకున్న వైద్యుని కుటుంబం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో సోమవారం రాత్రి తాండూరు -   కొడంగల్  మార్గంలోని ఫ్లై ఓవర్ వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలో నివాసం ఉండే వైద్యులు కళ్యాణ్ మోహన్ సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తన కారులో నెంబర్ టీఎస్04 ఈఎస్ 2300 లో హైదరాబాద్‌ నుంచి కోడంగల్‌ మీదుగా తాండూరుకు వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఫ్లై ఓవర్ వంతెన పై అకస్మాత్తుగా కారులో పెట్రోల్ అయిపోవడంతో కార్ ఇంజన్ ను స్టార్టు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో బ్యాటరీ ఒక్కసారిగా వేడెక్కి మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యుని కుటుంబం కారు లో నుండి దిగటంతో ప్రాణాపాయం తప్పింది.

పోలీసులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించి దగ్ధమైపోతున్న కార్ లో మంటలు అదుపులోకి తెచ్చారు. నేషనల్ హై వే పై ప్రమాదం జరగడం వల్ల కొంత సమయం ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
 పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.