కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ లీడర్, భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరకు సుహాస్  ను చంపుతానని బెదిరించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను తన అనుచరులు చంపేస్తారంటూ  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  చెరుకు సుధాకర్, కొడుకు సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.