పునాది రాళ్లలో కులాల సమాధి

పునాది రాళ్లలో కులాల సమాధి

- రాష్ట్ర బీఆర్ఎస్ కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే చోటు
- ఎన్నికల వేళ కులాలు గుర్తుకు వస్తున్నాయి
- సరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి 

ముద్ర,ఎల్లారెడ్డిపేట: పునాది రాళ్లలో కులాలను పాతి సమాధి చేస్తున్నరని రాష్ట్ర బీఆర్ఎస్ కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే చోటు కల్పించిన వైనం అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో  ఆదివారం ఓ పరామర్శ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి కులాలు గుర్తుకొస్తున్నాయని కుల బందు పేరిట ఓట్లను దండుకోవడమేనని  ఆరోపించారు.

బీసీలలో ఎన్నో కులాలు ఉన్నాయని వారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఎందుకు చోటు దక్కలేదని  ఆయన ప్రశ్నించారు. దళిత బంధు ప్రవేశపెట్టి  ఇన్ని నెలలు గడుస్తున్నా  పూర్తిస్థాయిలో దళితులందరికీ దళిత బంధు అందజేయలేదన్నారు. అదేవిధంగా బీసీలలో అన్ని కులాలు ఉన్నాయని వారందరికీ కూడా బీసీ బందు ఇచ్చి మాట నిలుపుకోవాలని సూచించారు. గిరిజనులకు గిరిజన బంధు ఇప్పటివరకు అందలేదని  కులాలతో రాజకీయం చేసే వ్యక్తిత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు.

విద్య వైద్యం మీద దృష్టి కేంద్రీకరించి పేద మధ్య తరగతి వర్గాలను కాపాడుకోవాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందరికీ అందజేయాలన్నారు.  ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, షేక్ గౌస్, పందిర్ల లింగం గౌడ్  లు పాల్గొన్నారు.