బడి పిల్లలకు నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌

బడి పిల్లలకు నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌

సీఎం కేసీఆర్ మరో మానవీయ పథకానికి శ్రీకారమని ప్రజల నుండి వెల్లువ

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ (శుక్రవారం) ప్రారంభించారు. దానిలో భాగంగానే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ పాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ నోముల భగత్, మిర్యాలగూడ భాస్కర్ రావు, దేవరకొండ రవీంద్ర కుమార్ ప్రభుత్వ పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం, చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌' పథకంను ప్రారంభించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపానికి చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌’ పేరుతో పథకాన్ని మొదలు పెట్టిందని తెలిపారు.