మంత్రి అల్లోల కు బీ ఫామ్ అందజేసిన సీఎం

మంత్రి అల్లోల కు బీ ఫామ్ అందజేసిన సీఎం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజక వర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కెసిఆర్ ఆదివారం బీ ఫామ్ అందజేశారు. 74 ఏళ్ల ఇంద్రకరణ్ రెడ్డి లా పట్టభద్రులు. 1987-91 మధ్య ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 1991-96 మధ్య ఎంపిగా, 1999-2004 మధ్య ఎమ్మెల్యే గా ఉన్నారు. పార్టీ పరంగా తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం (టీ సి ఎల్ ఎఫ్) కన్వీనర్ గా, తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 2004-08 లో ఎమ్మెల్యే గా ఉన్నారు. 2008-09 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపిగా కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. 2014-18 , 2018 నుండి ఇప్పటి వరకు మంత్రిగా కొనసాగుతున్నారు.