రైతును రాజును చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే చెందుతుంది

రైతును రాజును చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే చెందుతుంది
  • తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సంపద పెరిగింది 
  • కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 64 వేల కోట్ల వార్షిక బడ్జెట్ 
  • ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ హాయంలో రెండు లక్షల 77 వేల కోట్ల వార్షిక బడ్జెట్
  • భూముల రేట్లు కోట్లల్లో పెరిగాయి
  •  అభివృద్ధిలో పోటీ పడాలని ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
  • 3500 కోట్లతో అభివృద్ధి పనులు
  • ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు రోడ్లు
  • షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
  •  అవినీతికి స్థానం లేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  •  కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతిమయం


హుజూర్ నగర్  ముద్ర : తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందుతుందని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సంక్షేమ శాఖ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందుతున్నాయని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సంపద పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 64 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హాయంలో రెండు లక్షల 77 వేల కోట్లకు పెరిగిందని సైదిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బీసీలకు కూడా ఆర్థిక సహాయం చేయటానికి పథకాలను రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రతి బీసీ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.

పేద విద్యార్థుల కోసం అనేక గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారికి నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని తెలిపారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకాలకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెక్కులను అందజేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు రైతుబంధు ఉచిత విద్యుత్ 24 గంటల పాటు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వాన్నిదని అన్నారు. కేసీఆర్ పాలల్లో రైతులు రాజులుగా మారటమే కాక వ్యవసాయ భూముల రేట్లు పెద్ద ఎత్తున పెరిగాయని అన్నారు. గతంలో లక్ష రూపాయలు లేని భూముల రేట్లు ప్రస్తుతం కోట్ల రూపాయలకు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం సంపద సృష్టించి పేద ప్రజలకు వారి సంక్షేమానికి ఖర్చు చేస్తుందని సైదిరెడ్డి వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాల్లో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గం వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలలో వాటి పరిధిలోని గ్రామాల్లో రోడ్ల సౌకర్యం మంచినీటి సౌకర్యం సాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

ప్రతి మండల కేంద్రం నుండి గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు .లిఫ్టుల కోసం కాలువల మరమ్మత్తుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోగ్యాలు బాగా లేని వారికి ముఖ్యమంత్రి సహాయని నుండి సుమారు 14 కోట్ల రూపాయల వరకు మంజూరు చేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంత అవినీతిమయం అని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు వారి కుటుంబ సభ్యులను పదవుల్లోకి తీసుకొని రావటం కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి వారికి పట్టదని వారికి అవినీతి ముఖ్యమని అన్నారు. పట్టణ అభివృద్ధికి 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. తాను చేస్తున్న అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డు తగులుతున్నారని కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో పోటీ పడాలని ప్రతిపక్ష పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. చేస్తున్న అభివృద్ధికి అడ్డు తగలద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వ చివరి భూములు కూడా నీరు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సైదిరెడ్డి  వివరించారు.

వేసవి కాలంలో సైతం నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు జలకలను సంతరించుకున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని కోరారు .స్థానిక పార్లమెంట్ సభ్యులు  నెలకు ఒక్కసారి వచ్చి ఆరోపణ చేసి పోవటమే ఆయన పని అని ఆరోపించారు. అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. తాను అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రతి గ్రామాన్ని అనేకసార్లు పర్యటించా నని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్య తనకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వచ్చి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ లబ్ధిదారులతో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడించారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 500 మందికి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి చెక్కులను సైదిరెడ్డి అందజేశారు.

ముందుగా సమావేశంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరిరావు మఠంపల్లి ఎంపీపీ పార్వతీ కొండ నాయక్ జడ్పిటిసి జగన్ నాయక్ హుజూర్నగర్ ఎంపీపీ గూడెం శ్రీనివాస్ దొంగరి మంగమ్మ ఎమ్మార్వో జయశ్రీ మూడెం గోపిరెడ్డి లక్ష్మీనారాయణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి కుక్క డప్పు గురవయ్య అమర్నాథ్ రెడ్డి అమర్ జిల్లా అధికారులు రాంబాబు కిషన్ ప్రియాంక ఎంపీడీవో శాంతకుమారి ఎమ్మార్వో దామోదర్ రావు   నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జయ బాబు తదితరులు పాల్గొన్నారు.