విగ్రహాల ఏర్పాటు కోసం  సంతకాల సేకరణ

విగ్రహాల ఏర్పాటు కోసం  సంతకాల సేకరణ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : దేశం కోసం, ప్రజల సుఖ శాంతుల కోసం పరితపించిన మహనీయుల విగ్రహాలను మంచిర్యాల లో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వాయి పాపన్న, ఛత్రపతి శివాజీ, బీపీ మండల్ యాదవ్, చాకలి ఐలమ్మ, ఆచార్య జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ప్రధాన కోడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేస్తామని చెప్పారు. ప్రజల మనోభీష్టం ప్రకారం విగ్రహాలను ఏర్పాటు చేయవలసిందేనని అన్నారు.