నూతన మండలాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా

నూతన మండలాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
  • నూతనంగా ఏర్పాటైన గోరి కొత్తపల్లి మండలంలోని తాసిల్దార్ సముదాయ కార్యాలయ ఏర్పాటు కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర న్యూస్ రేగొండ:-ఇటీవల కొత్తగా ఏర్పాటైన గోరి కొత్తపల్లి మండలంలో తాసిల్దార్, కార్యాలయ ఏర్పాటు కోసం గోరి కొత్తపల్లి, గ్రామానికి చెందిన జెడ్. పి. హెచ్. యెస్. ప్రభుత్వ పాఠశాల  గదులను జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా,రేగొండ తహసీల్దార్  షరీఫ్,  ఎం. పి.డి. ఓ. సురేందర్, తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలికంగా గ్రామానికి చెందిన  పాఠశాలలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొనసాగించడం జరుగుతుందని. త్వరలోనే స్థలాన్ని గుర్తించి శాశ్వత కార్యాలయం నిర్మాణం చేపడతామని అన్నారు. కార్యాయానికి కావలసిన మౌళిక వసతులు మరియు ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతరత్రా పరికరాల కోసం ఒక నివేదికను  అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం రేగొండ తాసిల్దార్ కార్యాలయంలో గోరి కొత్తపల్లి, మండలానికి సంబంధించిన రెవెన్యూ గ్రామాల మ్యాపులను పరిశీలించారు ఏడు రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన గోరి కొత్తపల్లి  మండలంలో గల అన్ని గ్రామపంచాయతీల లో ఒక నోటీసు బోర్డును  ఏర్పాటు చేసి గోరుకొత్తపల్లి మండల పరిధికి వచ్చే గ్రామాల వివరాలను  ఆ బోర్డులో రాసి పెట్టాలని అలాగే ఆయా గ్రామాల రెవెన్యూ రికార్డులను తరలించేందుకు త్వరితగతిన  చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్థానిక తహసీల్దారు ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేగొండ తాసిల్దార్ షరీఫ్ ఎంపీడీవో సురేందర్,సర్పంచ్ సూదరబోయిన రజిత,విష్ణు,ఎంపీటీసీ హమీద్,రగుసాల తిరుపతి,నిమ్మల రాజు గోరి కొత్తపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు