క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :మంచిర్యాల జిల్లాలో 183 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాలలో కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది.  మంచిర్యాల మెడికల్ కాలేజి నుంచి ప్రారంభమైన అవగాహన ప్రదర్శనను కలెక్టర్ ,ఎమ్మెల్యే దివాకర్ రావు సంయుక్తంగా జండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిని సమూలంగా  నిర్మూలించాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. జిల్లాలో ఉన్న క్షయ వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. వ్యాధిగ్రస్తులు వ్యాధి మహమ్మారి నుంచి కోలుకునే విధంగా చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం  500 రూపాయల తో పాటు మందులను, చికిత్సలను అందిస్తుందని చెప్పారు. అనేకమంది క్షయ వ్యాధిని జయించారని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 25 సెంటర్లను ఏర్పాటు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన కు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. వ్యాధిగ్రస్తులు భయపడకుండా వైద్యులు ఇచ్చే మందులను వాడుతూ రోగాన్ని నయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా హిందూ సేవక్ సమాజ్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో టీబి వ్యాధిగ్రస్తులు ఐదుగురికి పోషక పదార్థాల కిట్లను అందజేశారు.