బక్రీద్ పండుగ కు ఏర్పాట్లు పూర్తి. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

బక్రీద్ పండుగ కు ఏర్పాట్లు పూర్తి. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

మెట్‌పల్లి ముద్ర:- బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.బుధవారం ఆయన పట్టణంలోని వెంకట్రావుపేట ఈద్గా, బిస్మిల్లా మజీద్ లో పండగ ఏర్పాట్లను పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా కుర్బానీ చేసే వేస్టేజ్ ను ఎప్పటికప్పుడు మున్సిపల్ ట్రాక్టర్లకు అందించాలని కుర్బానీ వేస్టేజ్ ను పట్టణంలోని డంపింగ్ యార్డ్ లో ఏర్పాటుచేసిన గుంతలలో వేసి పూడ్చివేయాలని ఈద్గా, మసీద్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. కుర్బానీ చేసే ముస్లింలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆయన వెంట ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, మతిన్ లు ఉన్నారు.