ముద్ర, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర తెలిపారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలు ప్రాంతాలను కమిషనర్ పర్యవేక్షించారు. అందులో భాగంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి వయా కిస్మత్పూర్ బండ్లగూడ జాగీర్ హెచ్పి పెట్రోల్ పంప్ జంక్షన్ వరకు 5.5 కిలోమీటర్ల గాను రూ.66 కోట్లు, వివేకానంద విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ ఎక్సైజ్ అకాడమీ వరకు కిలోమీటర్ల రూ.24 కోట్లు, దర్గా ఖలీజ్ ఖాన్ వై జంక్షన్ నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వరకు 0.85 కిలోమీటర్లు గాను రూ.11 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు 100 ఫీట్ల రోడ్లుగా విస్తరించినందుకు నిర్వహించినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.101 కోట్లతో నిర్మించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు మహబూబ్ మియా, కిషోర్ బాబు, అరవిడు, తులసి కృష్ణ, రాజ్ కుమార్, వాణి తదితరులు పాల్గొన్నారు.