నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఆన్లైన్ మోసాల బారిన పడవద్దని చైతన్యవంతం చేసేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఉదయం నిర్మల్ జిల్లా కుంటాల మండలం మేధన్పూర్ గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో ఆయన ప్రసంగించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. వాహనాల కొనుగోలు సమయంలో అప్రమత్తత అవసరమన్నారు. ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్న కారణంగా చిన్న చిన్న ప్రలోభాలకు ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్డెన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.