ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలోనే తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి

ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలోనే తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి
  • వేలకోట్లతో తుంగతుర్తి లో అభివృద్ధి పనులు
  • ఎమ్మెల్యేను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం విపక్షాల వెతుకులాట
  • నాటి ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు కార్యకర్తలు నేడు బి ఆర్ ఎస్ ఖాతాలోనే
  • ముఖ్యమంత్రి సభకు భారీగా తరలి వెళ్లనున్న టిఆర్ఎస్ శ్రేణులు

తుంగతుర్తి ముద్ర:తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పాటు నాటినుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలుపొందడం జరిగింది. అప్పటివరకు నియోజకవర్గంలో పలు ప్రధాన సమస్యలు   అపరిష్కృతంగా తీష్ట వేశాయి .ముందుగా వేలాది ఎకరాల బీడు భూములు అరకొరగా, ఆసం పూర్తిగా తీసిన కంపచెట్లతో నిండి ఉన్న ఎస్సారెస్పీ కాలువల దీనస్థితిని చూసిన ఎమ్మెల్యే వాటి రూపురేఖలు మార్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు.

వెనువెంటనే కాలువల మరమ్మత్తులు అసంపూర్తి వాటిని పూర్తి చేసి జల ప్రవాహానికి అనుకూలంగా మార్చారు .అనంతరం కాలువల నీరు వృధా పోకుండా ఆయా గ్రామాల గొలుసుకట్టు విధానంలో నిర్మాణమైన చెరువులలోకి నీరు వెళ్లేలా తూములు ఏర్పాటు చేశారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాలేశ్వరం జలాలు నేరుగా చెరువులోకి వెళ్లడం చెరువులు నిండి గత మూడు నాలుగు సంవత్సరాలుగా వేలాది ఎకరాల బీడు భూములు పంట పొలాలుగా మారాయి. లక్షలాది క్వింటాళ్ల వరి ధాన్యం పడుతోంది. దీంతో ఎమ్మెల్యే పై రైతాంగంలో అచంచలమైన  విశ్వాసం ఏర్పడింది .గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన వారి భూములు సైతం బీడులుగా ఉండగా నేడు వారికి కూడా కాలేశ్వరం జలాలు ఉపయోగంలోకి వచ్చాయి .

అత్యంత ప్రధాన సమస్యను ఎంతో నేర్పుతో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పరిష్కరించారు. అనంతరం గ్రామాల మౌలిక పరిస్థితుల అవగాహన కోసం పల్లెనిద్ర చేశారు .రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని సాహసం పల్లెనిద్ర గెలవగానే పట్నాలకే పరిమితమయ్యే ప్రజాప్రతినిధులు అనే పేరున రోజుల్లో గెలిచి ప్రజలను పలకరించి పల్లనిద్ర ద్వారా గ్రామాలలోని సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాలలో కనీసం పాదచారులు కూడా నడవలేని వీధులలో సిసి రోడ్లు వేయించారు. విద్యుత్ ,,తాగునీరు గ్రామాలలో మురుగునీటి కాలువలు ఆయా గ్రామాల గ్రామపంచాయతీల ముఖచిత్రం మార్చి వేశారు. పల్లె ప్రగతిని సాధించారు .ముఖ్యంగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు .

సమస్య ఏదైనా నేరుగా వెళ్లి చెప్పుకునే విధంగా తన నివాసం తిరుమలగిరిలో ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్ వెళ్లాలని పని లేకుండా పాలన సాగిస్తున్నారు .6000 కోట్లకు పైగా అభివృద్ధి నిధులతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి చేశారు. ఇంకా కొన్ని అపరిష్కృత సమస్యలు సైతం కోట్లాది రూపాయలతో పరిష్కారం అవుతున్నాయి. అంచలంచలుగా ఒక్కొక్క ప్రధాన సమస్యలు పరిష్కరిస్తూ ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఢీకొట్టడానికి విపక్ష పార్టీలు అభ్యర్థి కోసం వెతుకుతున్నారంటే టిఆర్ఎస్ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో ఊహించవచ్చు.

నాడు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి ప్రధాన అనుచరులు కార్యకర్తలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లారు. దీంతో విపక్షాలు కొంత డీల పడ్డాయని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్న ఎమ్మెల్యేను విపక్షాలు ఏ విధంగా నిలువరిస్తారో? నేడు జరిగే ప్రగతి నివేదన సభకు నియోజకవర్గంలో సుమారు 30 నుండి 40 వేల మంది తరలి వెళ్తుండగా ఈ ప్రజా ప్రవాహాన్ని విపక్షాలు నిర్వహించగలుగుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది .సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ విధమైన హామీలు ఇస్తారో హామీల కోసం ఎమ్మెల్యే ఏ విధంగా కృషి చేశారో సభ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.