కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తెలంగాణలో చోటు లేదు - మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 

కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తెలంగాణలో చోటు లేదు - మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని ఈసారి తెలంగాణలో బిజెపిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు సోమవారం సూర్యాపేటలోని బాలాజీ కన్వెన్షన్ లో జరిగిన విశ్వకర్మ యోజన లబ్ధిదారుల సమావేశం, సూర్యాపేట నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల శక్తి కేంద్రాల ఇన్చార్జిలకు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రచురించారు.

నరేంద్రమోదీ విజన్ ఉన్న నేత అని, సూర్యాపేటలో ఉండి జిల్లాలోని నాలుగు నియోజకవర్గలలో బీజేపీ ని గెలిపిస్తా అని చెప్పారు. తెలంగాణ ఎంతో మంది కోరుకుంటే వచ్చిన తెలంగాణ లో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1997 లోనే కాకినాడలో బిజేపి తీర్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి. చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తప్పిదాల వాళ్లనే తెలంగాణలో బలిదానాలు జరిగాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న కుటుంబ పాలనను తరిమి కొట్టాలంటే బీజేపీ తోనే సాధ్యం అవుతుందన్నారు.
తెలంగాణ, సూర్యాపేట లో 9ఏండ్లలో కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదనీ దుయ్యబట్టారు. ప్రతి గ్రామ పంచాయతీ కి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటకు నిధులు తెచ్చింది ఏమి లేదనీ, కేంద్రం వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిందని వివరించారు. వ్యాక్సిన్ ఉచితంగా అందించి కరోన ను అడ్డుకున్నాంఅని, మాయ మాటలతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందనీ, రైతులకు సబ్సిడీపై ఎరువులు అందిస్తుంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని తేట తెల్లం చేశారు. అయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అపి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ కి నిధులు లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో అయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నారనీ, 9ఏండ్లలో  పేదలు, అభివృద్ధి చెందినది అంటే నరేంద్రమోదీ విధానాలతోనే అని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వం  ఒక్క రూపాయి ఎక్కువ తీసుకువస్తే మేమంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేస్తుంటే తండ్రి కొడుకులు కేసిఆర్ కేటీఆర్ లు  కమిషన్ల పర్సెంటేజ్ అడగడంతో ప్రాజెక్టులు రాష్ట్రానికి రాకుండా వెనక్కు పోతున్నాయనీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయని ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట యమపాశం అయిందని,
నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయని కలలు కన్న తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు ఆవిరై ఆత్మహత్య లు చేసుకుంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 9ఏండ్లలో ఒక్క స్కామ్  లేని ప్రధాని నరేంద్రమోడీ ఆని ప్రశంసించారు. కార్యకర్తలే బీజేపీ ప్రధాన ఆయుధంఅని, బీజేపీ కార్యకర్తలు దేశం కోసం మాత్రమే పని చేస్తారన్నారు. 9ఏండ్లలో కుటుంబ పాలన చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చారు.

60ఏండ్లలో తెలంగాణ పరిపాలించిన కాంగ్రెస్ ఏమి సాధించి అని ఓటు వెయ్యాలనీ ప్రశ్నించారు.  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చరమ గీతం పాడి బిజెపిని గెలిపించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో బిజెపి నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర కర్నాటి కిషన్ ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూర మల్సూర్ గౌడ్, గజ్జల వెంకటరెడ్డి సంకినేని వరుణ్ రావు కట్కూరు కార్తీక్ రెడ్డి తోట లక్ష్మీనరసింహారావు, పల్స మల్సూర్ ఆబిద్ తదితరులు పాల్గొన్నారు.