అరటి పళ్ళు అమ్ముతూ.. ఎల్బీ నగర్ లో కొనసాగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర

అరటి పళ్ళు అమ్ముతూ.. ఎల్బీ నగర్ లో కొనసాగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : అరటి పళ్ళు అమ్ముతూ.. ఎల్బీ నగర్ లో  కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర వినుతంగా సాగుతుంది. సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్  పాదయాత్ర మొద్దలుపేటారు. ఈ సందర్భంగా ఆయన పబ్లిక్ తో మాట్లాడుతు సమస్యలను అడిగి తెలుసుకొని పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజలు  ఏదుర్కొంటున్న సమస్యలను  పరిస్కరిస్తానని పేర్కొన్నారు.

మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ అరటి పళ్ళు అమ్ముతూ, సామాన్య ప్రజల్లో ఒకడిగా కుటుంబ సభ్యుడిగా ప్రతి కుటుంబాన్ని అన్నా అక్క చెల్లి తమ్ముడు అంటూ పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నారు.