రైతులకు భరోసానిచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్

రైతులకు భరోసానిచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్
  • జిల్లెల్ల రామ్ రెడ్డి,కొమ్ము కృష్ణ  నేతృతంలో నందిగామలో ముమ్మర ఇంటింటి ప్రచారం

ముద్ర/ నందిగామ: రైతులకు భరోసమిస్తూ ఏకకాలంలో నిధులు విడుదల చేసి అన్నదాతల ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల్ల రామ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొమ్ము కృష్ణ మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గం లోని నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వరుసగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకాల అమలులో కొంత జాప్యం జరిగిందని పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే పూర్తిస్థాయిలో పథకాలను అమలు చేయడంతో పాటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా పనులు మొదలుపెట్టినట్లు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డి కి మద్దతుగా ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇప్పటికే జాతీయ నాయకులు ప్రకటిస్తున్నారని అందుకే హస్తం గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు కృషి చేయాలని కోరారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలను గడపగడప పంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జిల్లెల్ల రాoరెడ్డి,  అడ్వకేట్ ఆంజనేయులు, కృష్ణ గౌడ్, బి జంగయ్య గౌడ్ , పిట్టల రాములు,  టైలర్ కృష్ణ, వెంకటేష్ గౌడ్, ఎర్రగారిరమేష్, సీఎం నరేందర్ రెడ్డి, సప్పిడి మహేష్, అబి,రాము, జంగారి రాములు,తడకల జంగయ్య, చంద్రపాల్ రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.