జగ్జీవన్ రామ్ కు కాంగ్రెస్ నివాళులు 

జగ్జీవన్ రామ్ కు కాంగ్రెస్ నివాళులు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బుధవారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ జీవితం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు.