రాహుల్ అనర్హత వేటు పై కాంగ్రెస్ నిరసన

రాహుల్ అనర్హత వేటు పై కాంగ్రెస్ నిరసన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని  కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా నిరసించారు. శనివారం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు కళ్ళకు నల్ల పట్టిలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వం పై ఆక్రోశం వెళ్లగక్కారు. బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతు ప్లే కార్డులు చేతపట్టారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంను రక్షించాలని అంబేద్కర్ విగ్రహం కు విజ్ఞాప్తి చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా సభ్యత్వం రద్దు చేసినంత మాత్రాన కేంద్రంపై  పోరాటం ఆగదని కాంగ్రెస్ సీనియర్ నేతలు కెవి.ప్రతాప్, గోమాస శ్రీనివాస్ అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో బీజేపీ  ప్రభుత్వం తీరును ఎండగట్టడంతో జీర్ణించుకోలేక అనర్హత వేటు వేశారని వారు విమర్శించారు.