విద్యా దినోత్సవాన్ని బహిష్కరించి న కౌన్సిలర్

విద్యా దినోత్సవాన్ని బహిష్కరించి న కౌన్సిలర్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన  మున్సిపల్ కౌన్సిలర్ మజీద్ విద్యా దినోత్సవాన్ని బహిష్కరించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా తిలక్ నగర్ లో ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవం ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అవార్డు కౌన్సిలర్ మజీద్ ను ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవి ఆహ్వానించారు. అయితే సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించారు. పాఠశాలలో విద్యార్థులకు మౌళిక సదుపాయలు కల్పించడంలో అధికార పార్టీ విఫలమైనందున ఉత్సవాల్లో పాల్గొనలేనని చెప్పారు. పాఠశాల భవనం నిర్మించి 20 ఏండ్లు అయినా ఇప్పటి వరకు కనీసం రంగులు వేయించలేదన్నారు. మూత్రశాలలు, మరిగుదొడ్లు  లేవని, ప్రహరిగోడ కూడా లేదని మజీద్ తెలిపారు. 200 ఉన్న విద్యార్థుల సంఖ్య సౌకర్యాలు లేమితో 50కి చేరిందని తెలిపారు. విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తుంటే సంబరాల్లో ఎలా పాల్గొంటానని ప్రశ్నించారు.