గోవులను, గేదెలను అపరిపరిశుభ్రత వాతావరణం నుంచి తరలించకపోతే కఠిన చర్యలు - యాజమానిని హెచ్చరించిన తాసిల్దార్

గోవులను, గేదెలను అపరిపరిశుభ్రత వాతావరణం నుంచి తరలించకపోతే కఠిన చర్యలు - యాజమానిని హెచ్చరించిన తాసిల్దార్

ముద్ర.వీపనగండ్ల:- గోవులను గేదెలను అపరిశుభ్రతమైన వాతావరణంలో ఉంచి వాటి ఆలనా పాలన చూడకుండా హింసిస్తూ, చుట్టుప్రక్కల కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తున్న కానమోని కిష్టయ్య అనే రైతు ఆవులను గేదలను పరిశుభ్రతమైన వాతావరణంలో ఉంచాలని లేకుంటే వాటిని అక్కడ నుంచి తరలించాలని తాసిల్దార్ వరలక్ష్మి హెచ్చరించారు. మండల కేంద్రమైన వీపనగండ్ల గ్రామానికి చెందిన కానమోని కిష్టయ్య అనే రైతు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిపల్లి వెళ్లే దారిలో చుట్టుప్రక్కల కుటుంబాలు నివసించే ఇండ్ల మధ్య తన సొంత స్థలంలో సుమారు 80 ఆవులను గేదెలను అపరిశుభ్రత వాతావరణం లో పెంచుతున్నాడు.

పశువులకు సరియైన మేత లేక ఆకలితో అలుమటిస్తూ వాటిని ఇబ్బందులకు గురి చేయడమే కాక, వాటి నుంచిన ప్రదేశంలో వర్షపు నీరు నిల్వ ఉండి మురికి కోపంగా తయారై దోమలకు ఈగలకు నిలయంగా మారి వ్యాధులు ప్రబోలుతున్నాయని, అంతేకాక పేడ రొచ్చు వాసులను భరించలేక తిండి కూడా తినలేక పోతున్నామని చుట్టుప్రక్కల కుటుంబాల వారు పలుమారు పశువుల యజమానిపై మండల స్థాయి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేశారు. అయితే గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పశువుల నుంచి వచ్చే వాసనను భరించలేకపోతున్నామని, దోమలు ఈగలు ఎక్కువై వ్యాధుల బారిన పడుతున్నామని, పశువులను అక్కడి నుంచి వెంటనే తరలించి తమను రక్షించాలంటూ కాలనీ వాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. గురువారం తాసిల్దార్ వరలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పోలీసులు పశువులు నివసించే స్థలం వద్దకు వచ్చి వెంటనే అపరిశుభ్రత వాతావరణం లో ఉంచిన పశువులను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని, స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని యజమాని కిష్టయ్యను హెచ్చరించారు.


ఆసక్తి గల రైతులు దానపూర్వకంగా తీసుకెళ్లవచ్చు....

పశువుల యజమానికి రెండు రోజులు గడువు ఇచ్చామని, పశువులను అమ్ముకోవడం గాని లేదా ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించడం గాని చేయాలని, లేకుంటే మండలంలో ఆసక్తి గల రైతులు పెంచుకోవటానికి ఆసక్తి ఉంటే తాసిల్దార్ కార్యాలయంలో గాని పోలీస్ స్టేషన్ లో కానీ సంప్రదించి అగ్రిమెంట్ రాసి ఇచ్చి తీసుకెళ్లొచ్చు అని తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు. కానమోని కిష్టయ్య పశువులకు నరకయాతన చూపుతున్నారని, వాటికి సరైన తిండి లేక చిక్కిపోయాయని, ఉండటానికి పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడంతో, మురికి నీటిలో,బురదలో ఉండి అనారోగ్య పాలవుతున్నాయని, అంతేగాక చుట్టుప్రక్కల ప్రజలు వీటినుంచి ఇబ్బందులు పడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.