ప్రజా పాలన దరఖాస్తుల గడువు జనవరి 30 వరకు పొడిగించాలి - సిపిఎం విజ్ఞప్తి

ప్రజా పాలన దరఖాస్తుల గడువు జనవరి 30 వరకు పొడిగించాలి - సిపిఎం విజ్ఞప్తి

ముద్ర , పాలకీడు:- ప్రజాపాలన చివరి గడువు ఈ నెల 6 ముగియనుండగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కండగట్ల అనంత ప్రకాష్ విజ్ఞప్తి చేశారు .గత ప్రభుత్వం మాదిరిగా సకల జనుల సమ్మె నిర్వహించి అప్పటి ప్రభుత్వం వాటిని అటకెక్కిచ్చిందని అలా కాకుండా ప్రజా ఆమోదంతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాల వచ్చిన దరఖాస్తు లను పరిశీలించి ఐదు పథకాల అర్హులను గుర్తించి త్వరితగతన అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నగారా మోగక ముందే పథకాలు అమలు చేయాలని కోరారు.అంతేకాకుండా రేషన్ కార్డు లేని వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి విచార సమయంలో రేషన్ కార్డు లేని వారికి వెంటనే కార్డులు జారీ చేయాలని కోరారు. తెల్ల రేషన్ కార్డు పొందటానికి కావలసిన సంవత్సరా ఆదాయాన్ని రెండున్నర లక్షల వరకు పెంచి వాటి లోపు ఉన్నవారికి పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టిష్ ,సిపిఎం మండల నాయకులు ఎర్రడ్లమల్లారెడ్డి ,ఆర్లపూడి వీరభద్రం, దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.