హక్కులు సాధించుకునే వరకు ఉద్యమించాలి

హక్కులు సాధించుకునే వరకు ఉద్యమించాలి

ముద్ర,అచ్చంపేట23: బల్మూర్ మండల కేంద్రంలో  18వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్,  పాల్గొన్నారు.ఈ సందర్భంగా   సిపిఎం మండల కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ గత 18 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం దిక్కులు చూడడం దుర్మార్గం అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

9500 వేతనంతో ఏ కుటుంబం బ్రతక గలుగుతదని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాంగానే సియం కేసీఆర్ ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటే సరిపోతుందా వాటి కోసమే ప్రభుత్వాన్ని అధికారంలోకి ప్రజలు తీసుకురావడం జరిగిందా అని  ప్రశ్నించారు. కార్మికులు, కర్షకుల జీతాలు వాళ్ళ హక్కులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

ప్రపంచ చరిత్రలో ఏది సాధించుకోవాలన్నా ఏకైక మార్గం పోరాటం తప్ప మరొకటిది కాదని మీరు చేస్తున్న పోరాటం విజయం సాధించుకునే వరకు దృఢ సంకల్పంతో ఉద్యమించాలని కార్మికుల న్యాయమైన హక్కులు సాధించేవరకు వారికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు లాల్ మమ్మద్, మహేందర్, బాబర్ ఆంజనేయులు, రజియా బేగం పాల్గొన్నారు.