ఐ కె పి  కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలి

ఐ కె పి  కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలి

మద్దిరాల. ముద్ర:-ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట గోపి అన్నారు  మండలం లోని  జి కొత్తపల్లి గ్రామంలో జరిగిన సిపిఎం శాఖ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులు  గడుస్తున్న నేటికీ రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో రైతులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ధాన్యం అమ్మిన డబ్బులు రాక వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నడంతో రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు అమ్మకుండా వ్యవసాయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం సిపిఎం మండల కార్యదర్శి కల్లేపల్లి భాస్కర్ శాఖ కార్యదర్శి రామ్మూర్తి శాఖ సభ్యులు వెంపటి మల్లయ్య,ఏసు, సుధాకర్,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.