ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు...


రఘునాథపల్లి మండలంలో 1821 ఓట్లకు 1450 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. జాఫర్ ఘడ్ మండలంలో 1524 ఓటర్లు ఉండగా 1175 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.


స్టేషన్ ఘన్ పూర్ మండలంలో
మొత్తం 2036 మంది ఓటర్లు ఉండగా 1597 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిల్పూర్ మండలంలో మొత్తం 1154 మంది ఓటర్లు ఉండగా 908 మంది ఓటు వేశారు. లింగాల గణపురం మండలంలో మొత్తం 1677 ఓటర్లు ఉండగా 1316 ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ధర్మసాగర్ మండలంలో మొత్తం 1720 ఓటర్లు ఉండగా 1413 మంది ఓటేశారు. వేలేరు మండలంలో మొత్తం 704 మంది ఓటర్లు ఉండగా 561 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.