అప్పులు కాదు ఆస్తులు పెంచాం

అప్పులు కాదు ఆస్తులు పెంచాం
  • కేసీఆర్ మానవీయ కోణంలో పని చేశారు
  • రైతుబీమ అందజేస్తే ఆత్మహత్యలని చిత్రీకరిస్తున్నారు
  • కరీంనగర్ మాజీ ఎంపీ   వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ వారి హయాంలో చేసిన ఆదాయం, అప్పలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా మా కరీంనగర్ మాజీ ఎంపీ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం అప్పులు మాత్రమే చూపెడుతూ బిఆర్ఎస్ ను దోషిగా చూపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అప్పులే కాదు ఆస్తులను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడేండ్లలో కేవలం ఆసరా పెన్షన్లకు 48వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు.


మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమత్తుకు 45వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు 48వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు 72వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.
గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. పరిశ్రమలు పవర్ హాలిడే ప్రకటించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని వెల్లడించారు.
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా పెళ్ళైన పేదింటి ఆడబిడ్డలకు 1,00,116 ఇచ్చి ఇప్పటి వరకు 8వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
దళిత బంధు పథకం ద్వారా దళితులు ధనవంతులుగా మారేందుకు దళితబంధు పథకం కింద ఒక్కో యూనిట్ కు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు 25వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది అన్నారు.
1022గురకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి  పై 1లక్ష 25వేల రూపాయల ఖర్చు చేసాం.
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను నిర్మించాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసినం,కొత్త ప్రాజెక్టులు కట్టినం.
2014 కు ముందు కేవలం 7వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి. వాటిని 25 వేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెంచినట్లు స్పష్టం చేశారు.
ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు, కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయాలను నిర్మించాం
33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు,
2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ లు,
రాష్ట్రంలో  ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు,
8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు.
కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు,
1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.
7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్ ఏర్పాటు చేశామన్నారు.
2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు ఉంటే
2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు 
2023 లో 1,37, 571 కోట్ల  విద్యుత్ ఆస్తులు పెరిగినట్లు స్పష్టం చేశారు.
617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం,
146.50కోట్ల తో 125  అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి ఏర్పాటు చేశామని తెలిపారు.
2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో  3.12,398 కోట్ల తో159.6  తలసరి ఆధాయం పెరిగిందన్నారు.
ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు,మేయర్ సునిల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చక్కారెడ్డి, సీనియర్ నాయకులు మారుతి,చీటి రాజేందర్,మెండి మార్షల్, నాగరాజు,ద్యావ మధుసూదన్ రెడ్డి,చుక్క శ్రీనివాస్,సాయి, మోహన్,చందు, రేణుక ,పావణి తదితరులు పాల్గొన్నారు.