డీలర్ల సంక్షేమ భవన నిర్మాణ భూమి పూజ

డీలర్ల సంక్షేమ భవన నిర్మాణ భూమి పూజ

ముద్ర ప్రతినిధి భువనగిరి :  జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ భవన నిర్మాణ పనులకు  మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, రిటైర్డ్ ఎమ్మార్వో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి లు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి నాలుగు మండలాల రేషన్ డీలర్ల కోరిక మేరకు 500 గజాల స్థలము కేటాయింపజేసి భవన నిర్మాణం కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్, జిల్లా అధ్యక్షులు వెలగల రాజయ్య,  భువనగిరి మండల అధ్యక్షులు గంగాదేవి మహేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు, భువనగిరి నియోజకవర్గ రేషన్ డీలర్ల అధ్యక్షులు మన్నే యాదగిరి, దర్శన్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ రేషన్ డీలర్లు పాల్గొన్నారు.