అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
  • టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్
  • ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కలిసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు

ముద్ర, షాద్‌నగర్ : అర్హులైన పేద జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కలసి  జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు.  జర్నలిస్టులు అనేకమంది నిరుపేదలు ఉన్నారని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చాలాకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో అర్హులైన ప్రతి పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ షాద్ నగర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. 

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రభుత్వ స్థలాలు తగినంతగా లేవని, స్థలాల సేకరణ కోసం స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ను కూడా గతంలో సంప్రదించినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలాలను గుర్తించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. 

ఈ కార్యక్రమంలో  టీయుడబ్ల్యూజే(ఐజేయు) రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, షాద్ నగర్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం, షాద్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్, భాస్కర్, రమేష్, ఇలియాస్, శ్రీనివాస్, శివ, రాజశేఖర్, సమీ, శ్రావణ్, బైరామోని మహేష్, ఇక్బాల్, బసప్ప, జగన్, కార్తీక్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.