స్వరాష్ట్రంలోనే తండాల అభివృద్ధి : మంత్రి జగదీష్ రెడ్డి

స్వరాష్ట్రంలోనే తండాల అభివృద్ధి : మంత్రి జగదీష్ రెడ్డి
  • అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై.
  • బీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు 
  • మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఏకమవుతున్న గిరిజనులు
  • మూకుమ్మడిగా మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వస్త్రం  తండా వాసులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: స్వరాష్ట్రం లోనే తండాల అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్‌ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయం అన్నారు.తాజాగా సూర్యాపేట మున్సిపాలిటి  పరిధి 5,6 వార్డ్ లలోని  వస్త్రం తండా కు చెందిన కాంగ్రెస్,బీజేపీ లకు చెందిన 150 మంది నాయకులు, కార్యకర్తలు  మంత్రి జగదీష్ రెడ్డి  సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామగిరి నగేష్, విజయ సక్రునాయక్ , శ్రీను నాయక్ ఆద్వర్యం లో చేరికలు జరుగగా,ధనావత్ జోగ్యా నాయక్, టీ కం, లాలు హరియా రెడ్డి కళ్యాణ్ రాము శంకర్ ధరావత్ విజయ్, నాగేంద్రబాబు నాగు సైదా పాండు అచ్చమ్మ పార్వతి మాధవి రంగమ్మ కవిత తో పాటు బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.. కార్యక్రమం లో కౌన్సిలర్లు లీలా లింగానాయక్, బాషా మియా, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.