గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్  ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్  ప్రభుత్వ లక్ష్యం

ముద్ర ప్రతినిధి, నల్గొండ: గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి పలు గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతాలు అభివృద్ధి పనులు కొనసాగుతాయని అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలి కర్నాటి స్వామి, పల్లె కల్యాణి, సర్పంచ్ చలమల్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ చాపల మారయ్య, బీఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకటరెడ్డి, బండ పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పోలగోని సైదులు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.