కలెక్టర్ కార్యాలయం ముందు హమాలీ కార్మికుల ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు హమాలీ కార్మికుల ధర్నా

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల సివిల్ సప్లయ్ గోదాంలో  పని చేస్తున్న హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు ఏ.ఐ. టీ.యూ.సీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. సోమవారం నిర్వహించిన ధర్నా అనంతరం సమస్య లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సంతోష్ కు అందజేశారు.  ఈసందర్భంగా ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కార్మికుల ను ఉద్దేశించి మాట్లాడుతూ, హమాలి కార్మికులకు వేతనాలు చెల్లించడం లో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ధీంతో ఆర్ధిక సమస్యలతో హమాలీలు సతమతమవుతున్నారని అన్నారు. గోడౌన్ లో హమాలీలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు.

ఏడాది నుంచి ఖాళీగా ఉన్న సివిల్ సప్లయ్ డీ.ఎం.ను వెంటనే భర్తీ చేస్తే హమాలీల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పౌల్, హమాలి కార్మికులు పానుగంటి సత్తయ్య, భూమయ్య, సంపత్, సత్తయ్య, రాజయ్య పాల్గొన్నారు.