ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో రహదారుల విస్తరణ పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, సహా మిగతా పెండింగ్ రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో రమేష్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ సీతారామస్వామి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.