విధి నిర్వహణ తో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

విధి నిర్వహణ తో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కి శనివారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సిబ్బంది ప్రదర్శనని పరిశీలించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు.