యాచారం లో పిచ్చికుక్క స్వైరవిహారం..
- ఐదుగురికి గాయాలు.. గాయాలపాలైన వారిలో ముగ్గురు చిన్నారులు
ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: యాచారం మండల కేంద్రంలో శనివారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక ఎల్లమ్మ గుడి కాలనీలో నివసించే లోకేష్, ఏంజిలీనా, లడ్డు అనే ముగ్గురు చిన్నారులపై విరుచుకుపడింది. చిన్నారుల చేతులు, కాళ్లపై దాడిచేసి తీవ్ర గాయాలు చేసింది.
మేడిపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడైన నరసింహచారిని వెంబడించిన పిచ్చికుక్క అతనిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి ముందు కల్లాపి చల్లుతున్న స్వాతి అనే గృహిణిపై సైతం విరుచుకుపడి స్వల్పంగా గాయ పరిచింది. స్థానికులు కర్రతో పిచ్చికుక్కను వెంబడించడంతో అది తప్పించుకుంది. ఇంకా ఎంత మందిని గాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన చిన్నారులు, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.