- క్యాంపస్ లో 400 ఎకరాల భూమిని అమ్మకం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
- 400 ఎకరాల భూమిని అమ్మకాల్ని నిరసిస్తూ క్యాంపస్ ఎదుట విద్యార్థుల ఆందోళన
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల అమ్మకం వివాదాస్పదంగా మారింది.తమ విద్యాలయ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డేక్కారు.ఈ మేరకు హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఖబర్ధార్ సీఎం రేవంత్ రెడ్డి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ ప్లకార్డులు చేతబూని విద్యార్థులు నినాదాలు చేశారు.భవిష్యత్తులో విద్యా వికాసానికి వినియోగించాల్సిన యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడంపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.హెచ్ సీయూ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు.