బిఆర్ఎస్ పతనం ఖాయమైంది - మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

బిఆర్ఎస్ పతనం ఖాయమైంది - మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

ముద్ర, షాద్‌నగర్ : ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. 

మంగళవారం కొందుర్గ్ మండలం టేకులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, మహిళలు దాదాపు 200 మంది భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విరందరికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పిటిసి శ్యామ్ సుందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు జమ్రుత్ ఖాన్ కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. మీ పాలనపై విరక్తి చెంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దంగు శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం రెడ్డి, రామచంద్రపురం రమేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.