త్రాగు నీటి పైపులైను పనులు ప్రారంభం

త్రాగు నీటి పైపులైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: నల్గొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి సాగర్ నీళ్ల పైపులైను సరఫరా కొరకు జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్, మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి రవి నిధుల ద్వారా సాగర్ నీటి సరఫరా పైపులైను పనులకు రూ.1 లక్ష 50 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఇవాళ (మంగళవారం) ఆ పనులకు గ్రామ సర్పంచ్ పల్లెబోయిన యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే సాగర్ మా గ్రామానికి త్రాగునీరు అందుతుందన్నారు. గ్రామంలో నీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసి-2 ఈద నిర్మల శరత్ బాబు, బీఆర్ఎస్ పార్టీ మండల జాయింట్ సెక్రెటరీ జంగిలి నాగరాజు, గ్రామ కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు బొల్లం పుష్పలత, సింగం వసుమతి, ఆవుల శ్రీనయ్య, వర్కాల నర్సింహా, వర్రే అంజయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.