వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి - డిఎస్పీ నాగేంద్రచారి

వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి - డిఎస్పీ నాగేంద్రచారి

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు - వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి

ముద్ర ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఐతే తప్పా బయటకు రావద్దని వేములవాడ డీఎస్పీ కత్రోజు నాగేంద్రచారీ పేర్కొన్నారు.వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెబుతుంది...రైతులు, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్,  విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దని, వర్షం పడడంతో చిన్న పిల్లలు సరదాగా అట ఆడడానికి బయటకు వెళ్తుంటారని, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు.

చెరువులలో చేపలు పట్టే వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వాహన దారులు వెళ్లే క్రమం లో స్లీప్ అయ్యే అవకాశము ఉంటుంది, కావున హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు.అలాగే రోడ్ పై లోతట్టు వాటర్ ఉన్న దాటే క్రమం లో ఒక్కసారి ఓక కర్రతో లోతు చూసిన తర్వాతే వాహన దారులు వెళ్లాలని సూచించారు.ఉరుములు మెరుపులు వచ్చే క్రమం లో చెట్ల వద్ద రైతులు నిలబడవద్దన్నారు.గ్రామలలో పాత ఇల్లు, కూలి పోయే దశలో ఇల్లు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు.

ఫాజుల్ నగర్, హన్మ జిపేట నక్కవాగు, ఇతర చెవరువు, కుంటల  వద్ద జాగ్రత్తగా వహించాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. 100 కు కాల్చేయాలన్నారు.