ముఖ్యమంత్రి పర్యటనతో ముందస్తు అరెస్టులు

ముఖ్యమంత్రి పర్యటనతో ముందస్తు అరెస్టులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల వస్తున్న సందర్భంగా పోలీస్ లు ముందస్తు చర్యలో భాగంగా విపక్ష నేతలను అరెస్టు చేశారు. కలెక్టర్ కార్యాలయం నూతన భవనం, బీఆరెస్ పార్టీ భవనం ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు వస్తున్న కేసీఆర్ ను ప్రతిపక్షాలు అడ్డుకునే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్తలో భాగంగా అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు మజీద్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, పట్టి వెంకట కృష్ణ, ముదం మల్లేష్ వామపక్షాలు నేతలను పోలీస్ లు ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే తమను దొంగలను అరెస్టు చేసినట్లు అరెస్టు చేయడం ఏమిటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.