కెసిఆర్ పాలనలో  విద్యా వ్యవస్థ  నిర్వీర్యం..

కెసిఆర్ పాలనలో  విద్యా వ్యవస్థ  నిర్వీర్యం..
  • గ్రామ స్థాయి నుండి ఎన్ ఎస్ యు ఐ నీ బలోపేతం చేయాలి..
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం విద్యార్థి శక్తి..ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థులే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కెసిఆర్ విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ హాజరయ్యారు. రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీల కరపత్రం ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మ బలిదానాలకు చలించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని  ఏర్పాటు చేసింది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం గా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. ఉచిత నిర్భంద విద్య ఏమైందనీ ప్రశ్నించారు.ప్రాథమిక విద్య నుండి విశ్వ విద్యాలయ చదువులు కూడా ప్రైవేట్ పరం చేశారనీ విమర్శించారు. ఏ పార్టీ కి అయినా విద్యార్థి విభాగం కీలకం.. పార్టీ నీ బలోపేతం చేయడం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి.. క్షేత్ర స్థాయి లో  కాంగ్రెస్ పార్టీ నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్షేత్ర స్థాయిలో  సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని అన్నారు.రాష్ట్రంలో మొదటగా గ్రూప్ 1 పేపర్ లీకేజీ పై ఉద్యమించింది బల్మురి వెంకట్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమమే స్థానికత పై ఆదారపడి, పోరాటం చేసి తెలంగాణ సాదించుకుంటే సీఎం కెసిఆర్ విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేశారనీ ఆరోపించారు. కెసిఆర్ కు ఊడిగం చేసిన వారికి ప్రైవేట్ యునివర్సిటీలు కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తాం.317 జీ ఓ ను రద్దు చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా నుండి 20 వేల మంది రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ను గెలిపించడం చారిత్రక ఆవశ్యకం.. రాష్ట్ర భవిషత్ ను మార్చే శక్తి విద్యార్థులకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, క ల్లేపల్లి దుర్గయ్య, నక్క జీవన్, మన్సూర్, నేహాల్, ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు సాదుల వినయ్, ఉపాధ్యక్షుడు విజయ్ పటేల్, జిల్లా ఇంఛార్జి అవినాష్, నేషనల్ కో ఆర్డినేటర్ అఖిలేష్ యాదవ్, ఫయాజ్, జిల్లా అధ్యక్షుడు గుండా మధు, బీరం రాజేష్, లైసెట్టీ విజయ్,ఆ సిం సావన్ పాల్గొన్నారు.