ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం 

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు గురువారం లక్ష్మిటాకీస్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు పేరుతో ప్రభుత్వ నిధులతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈకార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొండా చంద్రశేఖర్,     పట్టణ అధ్యక్షుడు నరేష్, నాయకులు దోమల రమేష్, దాసరి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.