అభివృద్ధి ప్రదాత ఇంద్రన్నను గెలిపిద్దాం

అభివృద్ధి ప్రదాత ఇంద్రన్నను గెలిపిద్దాం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించుకుందామని నిర్మల్ మునిసిపల్ చైర్మన్ గంద్రత్ ఈశ్వర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని వార్డు నెంబర్ 33 భాగ్యనగర్, ముత్యాల వీధి లో ఆదివారం  ఇంటింటా ప్రచారం  చైతన్య రెడ్డితో కలిసి నిర్వహించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఇంద్రన్నను హాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిపించుకుందామని అన్నారు.