దేశం సుభిక్షంగా ఉండాలంటే మరో మారు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాల్సిందే

దేశం సుభిక్షంగా ఉండాలంటే మరో మారు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాల్సిందే
  • విశ్వాసానికి విశ్వసనీయతకు మారుపేరు నరేంద్ర మోడీ
  • 370 స్థానాలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం
  • బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఈటెల రాజేందర్
  • కెసిఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం
  • తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బిజెపి సర్కార్ రావాల్సిందే
  • భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
  • మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు డాక్టర్   బూర నర్సయ్య గౌడ్.


తుంగతుర్తి ముద్ర:-దేశం సుభిక్షంగా ఉండాలంటే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాల్సిందేనని విశ్వాసానికి విశ్వసనీయతకు మారుపేరే నరేంద్ర మోడీ అని బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ ఈటెల రాజేందర్ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిజెపి చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా తుంగతుర్తిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడు తూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ పాలన సాగుతుందని అన్నారు ,దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేది నరేంద్ర మోడీ సర్కారీ అని అన్నారు .గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన అంతర్గత రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు మురుగునీటి కాలువలు నరేంద్ర మోడీ చలవతోటి నిర్మాణం అవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నరేంద్ర మోడీ సర్కారే నిర్మాణం చేసింది అని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు రహదారులు నేడు నరేంద్ర మోడీ పాలనలో అభివృద్ధి పదంలో కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అడ్డగోలు ఉచిత పథకాల ఆశ చూపి మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కెసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కనుకూలంగా మారి అధికారంలోకి వచ్చిందే కానీ ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు చేసే సత్తా కాంగ్రెస్లో లేదని అన్నారు. కెసిఆర్ ఒక లక్ష రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కనుక అమలు చేస్తే తాను రాజకీయాలను తప్పుకోవడానికి కూడా సిద్ధమని ఈటెల రాజేందర్ అన్నారు. 500 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న హిందువుల మనోభావాలకు ప్రతీకైన రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం చేసిన ఘనత నరేంద్ర మోడీదేనని అన్నారు .రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయాల్లో అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం యుద్ధాన్ని నిలిపివేయించి సురక్షితంగా భారతీయులను తీసుకువచ్చింది వాస్తవం కాద అని అన్నారు దేశం కోసం దేశ పౌరుల కోసం అనుక్షణం పరితపించే వ్యక్తి నరేంద్ర మోడీని అన్నారు.ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో గతసారి కన్నా ఎక్కువస్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని 370 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పాటు చేస్తామని అన్నారు.


సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం తాను ఎంపీగా కాకముందు అభివృద్ధిలో వెనుకబాటు తనంలో ఉందని తాను ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మూడు జాతీయ రహదారులు తెచ్చానని అన్నారు .అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో 1400 కోట్లతో ఎయిమ్స్ వైద్యశాల మంజూరు చేయించి నిర్మాణం పూర్తయి నేడు ప్రజలకు వైద్య సౌకర్యం అందుతుందని అన్నారు .రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అధోగదిపాలైందని కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని ఇది ఇంకా అసమర్థ ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కారని వంద పడకల ఆసుపత్రి రుద్రమదేవి చెరువు రిజర్వాయర్  డిగ్రీ కళాశాల పారిశ్రామిక అభివృద్ధి తుంగతుర్తి లో బస్ డిపో లాంటి హామీలు ఇచ్చి వాటిలో ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు .రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో రానున్న మోడీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు .భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని బూర నర్సయ్య గౌడ్ కోరారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ,జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి ,జిల్లా నాయకులు సంకినేని రవీందర్రావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు గాజుల మహేందర్, లతోపాటు పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు