సి ఎం, సి ఎం అంటు బిజేపి నేతల టంగ్ స్లిప్..!

సి ఎం, సి ఎం అంటు బిజేపి నేతల టంగ్ స్లిప్..!

సైగలతో 'ష్.... గప్ చుప్' అంటూ అభిమానుల నోర్లు ముయించిన  'ఈటెల' షాద్ నగర్ లో సంఘటన

ముద్ర, షాద్‌నగర్ : బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపి శ్రేణులు సీఎం అంటూ నినాదాలు చేసి టంగ్ స్లిప్ అయ్యారు. ఇది గమనించిన ఈటెల వెంటనే తన నోటిపై వేలు వేసుకుని ష్.. గప్ చుప్ అని సైగ చేసి కార్యకర్తల నోరు మూయించారు. ప్రధానమంత్రి కిసాన్ కేంద్రాలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు స్వాగతం పలుకుతున్న తరుణంలో ఈ సంఘటన చోటచేసుకుంది.